ఏ సందర్భానికైనా ఎవరైనా ధరించగలరు ముత్యాల ఆభరణాలు అందమైనవీ, విలాసవంతమైన వీ కూడా.ముత్యపు చిప్ప ల నుంచి సహజంగా తయారై వచ్చే ముత్యాలు తేలికైనవీ అత్యంత ఫ్యాషనబుల్ కూడా. ముత్యాలు బంగారం కలిపిన నగలు ఎప్పటికీ అవుటాఫ్ ఫేషన్ కాదు. సెలబ్రెటీలు తమ స్టయిల్ ను ముత్యాల నగల తో మరింత మెరుగుపరచు కొంటుంటారు. ఆధునిక వధువులు ఇష్టంగా ధరించాలి అనుకునే మొగల్ సాంప్రదాయపు జాడవ్ ఆభరణాల్లో కూడా గుత్తులుగా వేలాడే ముత్యాలే ప్రత్యేక ఆకర్షణ. జాడవ్ నెక్లెస్ లు వధువు వస్త్రాభరణ ఆధునిక టచ్ ఇస్తాయి. వేలాడే బరువైన బట్టలకు అసలైన అందం వాటికి కూర్చిన ముత్యాలే.. ముత్యాలు బంగారం కలిసి స్వచ్ఛంగా ముచ్చటగా ఫ్యాషన్ స్టేట్ మెంట్ లో ముందు వరుసలో ఉంటాయి. పెద్ద సైజు ముత్యాలకు వజ్రాలు పెండెంట్స్ మరీ ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే నవరత్న ఆభరణాలు మన దేశంలో అత్యంత ప్రాచీనం. కెంపు, పచ్చ, ముత్యం, పగడం, వజ్రం, వైడూర్యం, నీలం, పుష్యరాగం తో కూడిన ఆభరణం ధరిస్తే అదృష్టం మంచి భవిష్యత్తు ఉందని నమ్ముతారు. సూర్యుని చుట్టూ గల గ్రహాలకు ఇవి చిహ్నాలుగా భావిస్తారు. జాతక చక్రాల లోనూ ఇవి అనుసంధానమై ఉంటాయి. నెక్లెస్ లు బ్రాస్ లైట్స్, చెవి దిద్దులు ఇతర నగల్లోనూ నవరత్నాలు ధరిస్తున్నారు. ఇక ఉంగరాలు సర్వసాధారణం. ఈ నగల్లోనూ ముత్యానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నవరత్నాల నగలు అందానికే కాకుండా వ్యక్తుల మానసిక భావోద్రేక పరిస్థితులను సమతుల్యం చేస్తాయి.
Categories