చీనాబ్ బ్రిడ్జి బహుశా ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైలు వంతెన గా చెప్పొచ్చు. ఈ సంవత్సరం పూర్తి కానున్న ఈ బ్రిడ్జి మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్తి చేస్తోంది. జమ్ము కాశ్మీర్ లో చీనాబ్ నదిపైన నిర్మిస్తున్న ఈ వంతెన ఇంజినీరింగ్ అద్భుతం. సాధారణంగా రైలు వంతెన నిర్మించాలంటే కింద నుంచి స్తంభాలు కట్టి వాటిపైన పట్టాలు వేస్తారు. కానీ ఈ చీనాబ్ బ్రిడ్జి కి అసలు స్తంభాలే లేవు. చీనాబ్ నది ఒక ఆకారం లో ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ నుంచి రైలు వంతెన కు ఎత్తు 359 మీటర్లు అంటే 1178 అడుగులు బ్రిడ్జి పొడవు 1,315 మీటర్లు అంటే 4,314 అడుగులు పైనుంచి ఆర్చ్ లాగా కట్టిన ఈ బ్రిడ్జి పొడవు 480 మీటర్లు ఇది ప్రపంచంలోనే పొడవైన బ్రాడ్ గేజ్ రైల్వే నెట్ వర్క్ 2002 లో జాతీయ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టి మధ్యలో కొంతకాలం ఆగి, ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. ఇది పూర్తయితే జమ్ము నుంచి బారాముల్ల కు నేరుగా రైలు ప్రయాణం చేయొచ్చు ఈ రైలు ప్రయాణం చేస్తుంటే ఆకాశంలో తేలినట్లు ఉంటుందని పర్యాటకులకు ఆకర్షణగా ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి అద్భుతాలు చూస్తుంటే మన దేశపు ఇంజనీర్ల గొప్పతనం ఏమిటో తెలుస్తుంది.
Categories