కొందరు జంతుప్రేమికులు కుక్కలు, పిల్లుల నుంచి పులి వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుని వార్తల్లో నిలుస్తారు. మరికొందరైతే.. పెంపుడు జంతువులను ఇంట్లో మనిషిగా భావించి.. పుట్టినరోజు వేడుకలను కూడా చేస్తారు. అయితే ఓ మహిళ ఏకంగా చింపాంజితోనే ప్రేమలో పడింది. నాలుగేళ్లు దానిని కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న జూ అధికారులు.. ఆమెపై నిషేధం విధించారు. బెల్జియానికి చెందిన ఆది టిమ్మర్మన్స్ జంతు ప్రేమికురాలు. తరచూ ఆమె ‘యాంట్వెర్ప్ జూ’కు వెళ్తుండేది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ‘చిటా’ అనే చింపాంజితో ప్రేమలో పడింది. ఆ చింపాంజి కూడా టిమ్మర్మన్స్.. జూ కు రావడం గమనించేది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య బంధం ఏర్పడింది. జూ’లోని జంతువులపై మనుషులు ఎక్కువ ఆప్యాయతగా, ప్రేమగా మెలిగినా అవి వింతగా ప్రవర్తిస్తాయని.. వారితో తప్ప ఇతర జంతువులతో కలిసి ఉండలేవని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే చిటాపై పెను ప్రభావం చూపుతుందనే కారణంతోనే టిమ్మర్మన్స్పై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.