Categories
మన ఇంటి గోడలకు వేసే రంగులు మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయని అంటారు నిపుణులు. గోడల రంగును బట్టి ఉంటుందంటారు. కొన్ని రంగులు ప్రశాంతతతో పాటు ఆశావహ దృక్పధాన్ని పెంచుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆకుపచ్చ రంగు ఆలోచనల్లో వేగాన్ని పెంచుతుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఆశ ఉంటుంది. ఆందోళన, వత్తిడి గందరగోళం తొలగిపోతాయి. నీలం రంగు బుద్ధిని వికసింపజేస్తుంది కోపాన్ని తగ్గిస్తుంది. గులాబిరంగు గోడల మధ్య ఉండే ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలని పిస్తుంది. నిద్ర హాయిగా పడుతుంది పసుపు పచ్చ రంగు సహనాన్ని రెట్టింపు చేస్తుంది వ్యతిరేకమైన ఆలోచనలను అదుపు చేస్తుంది.