అమ్మాయిలు డాక్టర్లు కావాలనుకుని నేను నా భర్త ఎంతో కష్టపడ్డాము, ప్రతి పైసా పిల్లల చదువుకు వెచ్చించాం. అలాగే వాళ్లు పెరిగి పెద్దయి డాక్టర్లు అయ్యాక కట్నం తీసుకొని పెళ్లిళ్లే చేద్దామనుకొన్నాం అదే చేశాం కూడా అంటుంది జైన. కోజికోడ్ జిల్లాలోని నారా పురం అన్న చిన్న పల్లె నుంచి బతుకు తెరువు కోసం వెళ్ళిన జైన అహ్మద్ దంపతులకు వరుసగా ఆరుగురు ఆడపిల్లలే కలిగారు. తాము కలగన్నట్లు వాళ్ళను డాక్టర్ లను చేసింది తల్లి. ఆరు మంది లో ఇప్పుడు డాక్టర్ ఫాతిమా అహ్మద్,హాజిరా అహ్మద్,అయిషా అహ్మద్, ఫ్రైజి అహమద్ ఇప్పటికే డాక్టర్లుగా ప్రాక్టీస్ చేస్తుండగా రిహానా అహ్మద్ ఫైనలియర్ ఎంబిబిఎస్ లోను అమీరా అహ్మద్ మొదటి సంవత్సరం ఎం బి బి ఎస్ లో ఉంది. ఇప్పటికీ పెళ్లయిన నలుగురి అమ్మాయిల భర్తలు డాక్టర్లే. కట్నం పుచ్చుకొని వారే.