దక్షిణ శాఖ లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ మానిటరింగ్ పరిశోధన చాలా క్లిష్టం పైగా ఖర్చుతో కూడుకున్న పని మేము కనిపెట్టిన విధానం ఇంజన్ పనితీరు కండిషన్ పైలెట్ కు ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తుంది అంటుంది దగ్గుబాటి శిరీష. రక్షణ శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీవో జాతీయ స్థాయిలో డేర్ టు డ్రీమ్ 2.ఓ-2020 కార్యక్రమానికి యువ శాస్త్రవేత్తల వ్యక్తిగత విభాగం నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన కుప్పం నుంచి డాక్టర్ శిరీష ఒక్కరే ఎంపికయ్యారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ చేసిన శిరీష డేర్ అండ్ డ్రీమ్ పోటీల్లో భాగంగా మూడు అంచెల వడపోత తర్వాత వ్యక్తిగత విభాగంలో శిరీష ఎంపికయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా అబ్దుల్‌కలాం ఆత్మనిర్భర్ పురస్కారం అందుకున్నారు.