Categories
టెలివిజన్ ముందు కూర్చుని అర్ధరాత్రి దాకా ఉండటం చాలా మందికి అలవాటైపోయింది. అంతసేపు మేలుకొని సహజంగా ఆకలి వేస్తుంది కనుక రకరకాల చిరుతిండ్లు తినేస్తూ ఉంటారు. అర్ధరాత్రి చిరుతిండ్లు తినడం మంచిదేనని ఆరోగ్యవంతమైన స్నాక్స్ తింటే ఇబ్బంది లేదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అర్ధరాత్రి ఆకలి వేస్తే బెర్రీలు తినొచ్చు వీటిలో ఉండే పీచు మెగ్నీషియం నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉండటం లో ఉపకరిస్తాయి తృణ ధాన్యాలతో తయారు చేసిన స్నాక్స్ ఏవైనా తినొచ్చు వాటిలో ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే పాప్ కార్న్, బాదం పప్పులు, వాల్ నట్స్ తినచ్చు కప్పు వేడి నీళ్లలో పసుపు వేసి తాగచ్చు.