మన చుట్టూ ఉన్న వారందరికీ ఎన్నో అనుభవాలుంటాయి. దాన్ని వింటే చాలు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకే నేను మాట్లాడటం కన్నా ఎక్కువ వినేందుకే ప్రాముఖ్యత ఇస్తాను అంటారు లీనా నాయర్. హిందుస్థాన్ లివర్ లో మానవ వనరుల విభాగానికి ఇన్ ఛార్జ్ గా ఉన్నా లీనా నాయర్ ఫ్రాన్స్ కు చెందిన ఛానల్ అనే లగ్జరీ గ్రూప్ కు సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల,పరాగ్ అగర్వాల్ ల వరుసలో ఒక అంతర్జాతీయ సంస్థ కు నేతృత్వం వహించనున్నారు లీనా నాయర్. భారత సంతతికి చెందిన లీనా నాయర్ 2016లో యూనీలీవర్ లో ఫస్ట్ ఫిమేల్ ఫస్ట్ యంగెస్ట్ హెచ్ ఆర్ ఓ గా చేరారు ఫార్చ్యూన్‌ మ్యాగజైన్ 2021 సంవత్సరానికి గాను ఆమెను మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో ఎంపిక చేశారు.

Leave a comment