Categories
పిల్లలకు పాల దంతాలు వస్తుంటే చేతికి అందిన ప్రతీ వస్తువు నోట్లో పెట్టుకొంటారు అప్పుడు పిల్లలకు టీతర్లు ఉపయోగపడతాయి. ఈ టీతర్ల తయారీలో లోహం ఉండకూడదు. నాన్ టాక్సిక్ టీతర్ల ను ఎంచుకోవాలి. పిల్లలు కొరికేందుకు మెత్తగా ఉండాలి టీతర్ల లో నీళ్ళు నిండినవి జెల్ నింపినవి ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు రంధ్రాలు పడ్డాయి ఏమో పరీక్ష చేస్తూ ఉండాలి. ప్లాస్టిక్ టీతర్లు రసాయనాల ప్రమాదం ఉంటుంది. సిలికాన్ తో తయారైన టీతర్లు సురక్షితం.