Categories
అస్సాం తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలిస్ (ఐజీ) గా వయొలెట్ బారువాకు ప్రభుత్వం పదోన్నతి కల్పించారు. గౌహతి యూనివర్శిటీ నుంచి బాచ్‌లర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తీసుకున్నారు బారువా.గౌలపర, మోరిగన్, కచర్,బర్‌పెట జిల్లాల్లో ఎస్పీగా విధులు నిర్వహించారు.సీబిఐ విభాగంలోనూ నేరపరిశోధనలో, నేరాలను అదుపుచేయటంలోనూ తనదైన ముద్ర వేశారు.అస్సాం పోలిస్‌శాఖలో మహిళల సంఖ్య చాలా తక్కువ.తొలి మహిళా డీఐజీ, తొలి ఐజీ అయిన బారువా స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు పోలిస్‌శాఖలో పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు.బారువా సాధించించిన మరో గొప్ప విజయం ఇది.