Categories
ఒకే నగలు రెండు రకాల డిజైన్లతో ఉండే ఫ్లిప్ రొటేటబుల్ జ్యువెలరీ మార్కెట్ లోకి వచ్చింది. ఈ రొటేటబుల్ నగల్లో చుట్టూ ముత్యాలు చక్కని చెక్కుడు ఉండే హారాలు లాకెట్ లో ఉంటుంది. అసలైన కిటుకు బిళ్ళకు ఒకవైపు లక్ష్మీదేవి, రామ పరివారము,దశావతారాల రూపాలు ఉంటే మరోవైపు చక్కని డిజైన్లతో కెంపులు, పచ్చలు వజ్రాల ఎనామిల్ మెరుపులు ఉంటాయి. ఒక పక్క దేవతామూర్తులు మరో పక్క టెంపుల్ జువెలరీలా మెరుపుల రాళ్ల డిజైన్ లతో ఇదో ట్రెండీ ఆభరణం. పెళ్లిళ్లు రిసెప్షన్ ల వేడుకలకు ఈ హారాలు, వడ్డానం వంటివి చీర మార్చినట్లే నగ డిజైన్ మార్చి కొత్త నగలా ధరించే అవకాశం ఉంది.