Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2021/11/hair2-1573024312-1577861908.jpg)
చర్మాని, శరీరానికి లాగా శిరోజాలకు డిటాక్స్ కావాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. కురుల వాడే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ఎంత తలస్నానం చేసిన కొంతైనా జుట్టుపై ఉండి హాని కలిగిస్తాయి. మృతకణాలు పోగొట్టేందుకు చర్మాన్ని రుద్దినట్టు మాడకు ఉపయోగించే స్కాల్స్ స్క్రబ్ లు మార్కెట్ లో దొరుకుతాయి. వీటితో మాడుపై పేరుకుపోయిన మృత కణాలు జిడ్డు మురికి తొలగించాలి. అలాగే మాడుకు తేమ కూడా అవసరం. వారంలో ఒక్కసారి నూనె రాయటం హెయిర్ మాస్క్ పట్టించడం చేయాలి. అప్పుడప్పుడు జుట్టు చివర్లు కత్తిరించాలి. రసాయనాలతో కూడిన ఉత్పత్తుల కంటే అలోవెరా, ఆపిల్ సిడర్, వెనిగర్ వంటివి ఉండేలా ఎంచుకుంటే శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.