Categories
ఆరోగ్యాన్ని కూడా అలవాటు చేసుకోవచ్చు అంటారు ఎక్సపర్ట్స్. జీవనశైలి ని బట్టే ఆరోగ్యం ఉంటుంది. సూర్యుని వెలుగు మీద పడేలా వాకింగ్, యోగా చేయాలి. కచ్చితమైన ఆహార వేళలు పాటించాలి కార్బోహైడ్రేట్స్ తగ్గించి పండ్లు తాజా కూరగాయలతో చేసిన ఆహారం తినాలి. దప్పిక లేకున్నా మంచి నీళ్లు తాగే అలవాటు చేసుకోవాలి. బరువు తగ్గాలని పొట్టని ఖాళీగా ఉంచితే లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది. మితిమీరిన తిండి ఎంత నష్టమో తినకపోవటం కూడా అంతే నష్టమని మరిచిపోవద్దు. 7 గంటలు నిద్ర ఆరోగ్యం.శరీరానికి నిద్ర అద్భుతమైన రీఛార్జ్.