Categories
ఢిల్లీలోని కమ్లా మార్కెట్‌లోని పింక్ చౌకిలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న కిరణ్‌సేథీ లేడీ సింగం అంటారు. 1992లో జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించిన కిరణ్‌సేథీ మహిళా కానిస్టేబుల్ లకే కాదు పురుషుల కు జూడో కరాటే లో శిక్షణ ఇస్తారు. సామాజిక సేవలోనూ తన వంతు పాత్ర పోషిస్తారు కిరణ్‌సేథీ. విధి నిర్వహణ తర్వాత స్ట్రీట్ చిల్డ్రన్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చదువు నేర్పించడం, మహిళలకు హస్తకళలు శిక్షణ, అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తారు. 34 ఏళ్ల సర్వీసులో ఎనిమిది లక్షల మంది అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య శిక్షణ ఇచ్చారు కిరణ్‌సేథీ.