సాంప్రదాయ వేడుకల్లో తెలుగింటి ఆహ్వానానికి ప్రాధాన్యత ఉంటుంది. సాధారణంగా కలంకారీ ప్రింట్స్ బెనారస్ కంచి పట్టు తో ఇప్పుడు సాంప్రదాయ డిజైన్స్ చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. రంగుల కాంబినేషన్లు వేడుకలు బట్టి మారినా ఫెస్టివల్ నుంచి గాఢమైన కలర్స్ ముఖ్యమైన ఎంపికగా ఉన్నాయి. లంగా ఓణీ లు కూడా సాంప్రదాయం లుక్ అనగానే పెద్ద అంచున్న లంగా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ దుపట్టాతో ప్రత్యేకంగా కనిపించేలా స్టైలిస్ట్ లు డిజైన్ చేస్తున్నారు. దుపట్టా సాధారణంగా సాధాగా ఉన్న లంగా పైన కూడా, భారీగా ఉండే ఎంబ్రాయిడరీ పనితనం ఉట్టి పడేట్లు తయారు చేస్తున్నారు. అలాగే కలంకారీ క్రాప్ టాప్ కు మిర్రర్ తో హాండ్స్ డిజైన్ చేయటం కూడా స్పెషల్ గా అనిపిస్తుంది. బార్డర్ లెహంగా పైకి కలంకారీ బ్లౌజ్ కూడా మరింత ప్రత్యేకంగా అనిపించేలా చేస్తుంది. మోడ్రన్ డ్రెస్ లు వేసుకొనే అమ్మాయిలు కూడా వేడుక అనగానే లంగా ఓణీ, లెహంగా దుపట్టా నే ఇష్టపడుతున్నారు.
Categories