Categories
భారతీయత ఉట్టిపడే ఇండో వెస్ట్రన్ స్టైల్ సరికొత్తగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. చీరె జీన్స్ కలిపి ధరించే ఈ స్టయిల్ లో ఆకర్షణీయమైన రంగుల తో కూడిన చీరను జీన్స్ టాప్స్ మీదకు ఓణిలా ధరించడం ఫ్యాషన్. పంజాబ్ కు చెందిన పుల్కారీ, రాజస్థాన్ మిర్రర్ వర్క్ వెస్ట్రన్ స్టయిల్ గార్మెంట్స్ లో చోటు దక్కించుకున్నాయి. మీనాకారి, కుందన్, జర్దోసి లు కూడా వెస్ట్రన్ దుస్తులకు సంప్రదాయ అందాలు తీసుకొచ్చాయి. భారతీయ పాశ్చాత్య వస్త్ర సంస్కృతుల మేళవింపు తో ఇండో వెస్ట్రన్ డ్రెస్సులు పదిమందిలో ప్రత్యేకంగా నిలబడతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ రకం దుస్తులకు హై హిల్స్, బెల్ట్ చాలా చక్కగా మ్యాచ్ అవుతాయి.