Categories
గ్రీన్ టీ ఎంతో పాపులర్. డైట్ అనే విషయం ప్రస్తావన వస్తే అందులో గ్రీన్ టీ తప్పనిసరిగా ఉంటుంది. కామెల్లియా సినెన్సిస్ అనే మొక్క నుంచి తయారైన గ్రీన్ టీ కి ఆకుపచ్చ రంగు కారణంగా ఆ పేరు వచ్చింది గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. టైప్-టు డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది. దంతాల ఆరోగ్యానికి గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధి కలిగించే బ్యాక్టీరియా గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశింపజేస్తాయి. నోటి క్యాన్సర్ రిస్క్ ను కూడా గ్రీన్ టీ తగ్గించగలుగుతుంది. బరువు తగ్గేందుకు గ్రీన్ టీ పరోక్షంగా సహాయపడుతుంది.కానీ అందులో ఎక్కువ తేనె కలపకూడదు అలాగే అతిగా తాగడం మంచిది కాదు.