Categories
జుట్టు పొడవుగా కనిపించేందుకు హెయిర్ ఎక్స్ టెన్షన్ వాడుతూ ఉంటారు.వీటిని మాడుకు అంటిస్తారు. కనుక వెంట్రుకల కుదుళ్ళు బలహీన పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. తీసేప్పుడు జాగ్రత్తగా వేళ్ళతో నెమ్మదిగా తీయాలి.తల శుభ్రం చేసుకున్నట్లు ఈ ఎక్స్ టెన్షన్స్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.చెమటతో ఈ ఎక్స్ టెన్షన్ లు ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. మరీ బరువైన ఎక్స్ టెన్షన్ లు వాడితే సహజంగా ఉండే వెంట్రుకలు రాలిపోతాయి.