మహిళలకు అంతగా ప్రవేశం లేని ఫార్మా రంగంలో అడుగు పెట్టి, స్వయంగా మురళీకృష్ణ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి ఫార్మా క్వీన్ గా పేరు పొందింది సత్య వడ్లమాని. ఇంజనీరింగ్ చదువుకున్న సత్య 1972లో ఆర్మర్ కెమికల్స్ మార్కెటింగ్ విభాగంలో పనిచేశారు. 2004 లో మురళీకృష్ణ ఫార్మా స్థాపించారు. వీరి సంస్థ లో ఔషధ తయారీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ల అనుమతి ఉంది. 25 మిలియన్ల టర్నోవర్ తో వందల మందికి పైగా క్లైంట్స్ తో 64 ఇంటర్నేషనల్ కంపెనీలు సత్య సారధ్యంలో విజయవంతంగా నడుస్తోంది ఫార్మా కంపెనీ.