తెల్లని ముత్యాల నగలు ఎప్పుడూ బావుంటాయి. సంప్రదాయ దుస్తుల పైన ఆధునిక వస్త్ర శ్రేణి లోనూ ముత్యాల నగలు అందంగా అమిరిపోతాయి. ముత్యాల నగలు సహజమైన మెరుపు పోకుండా వుండాలంటే వాటిని శ్రద్ధగా వాడాలి. అలంకరణ పూర్తయ్యాకే వాటిని ధరించాలి. మేకప్ క్రీముల్లో రసాయనాల ప్రభావం వాటిపైన పడితే మెరుపు పోతుంది. వీటిని నేరుగా ఆభరణాల పెట్టెలో పడేయకూడదు సిల్క్ లేదా వెల్వెట్ వస్త్రంలో భద్రంగా పెట్టాలి. వేడి సోకితే ముత్యం సహజత్వాన్ని పోగొట్టుకుంటుంది. మంచినీటితోనే శుభ్రం చేయాలి. బంగారం వెండి వస్తువుల్లో పొదిగిన ముత్యాలు క్లీన్ చేయాలంటే అమోనియా తో తయారు చేసిన క్లీనర్ ను ఉపయోగించకూడదు. ఇవి మెరుపు తగ్గిస్తాయి. ఎప్పుడు ముత్యాల నగలు వేసుకున్నా వాటిని శుభ్రంగా పొడి గుడ్డతో తుడిచి తడి లేకుండా చూసి సిల్క్ బట్టలో భద్రం చేయాలి. అవి మెరవాలంటే మెత్తని సిల్క్ బట్టతో శుభ్రంగా తుడిస్తే చాలు.
Categories