పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెపితే తక్కువ ఖరీదులో పెరుగుతో అందాన్ని మెరుగు పరుచుకొనే చిట్కాలు చెబుతున్నారు సౌందర్యనిపుణులు . ఎండలో ఎక్కువ సేపు ఉంటే చర్మం నల్లగా మారటం జుట్టు చిట్లిపోవడం సహజం .అలాంటపుడే పెరుగులో పావు కప్పు నిమ్మరసం మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ .కలిపి తలకు పట్టించాలి . ముఖానికి ఫేస్ మాస్క్‌లా కూడా వేసుకోవాలి .అరగంట తర్వాత స్నానం చేస్తే ఈ సమస్యలు పోతాయి . పావు కప్పు పెరుగులో రెండు చెంచాల ఓట్స్ పొడి చెంచా తేనె కొద్దిగా నిమ్మరసం కలిపి మొహం మెడ చేతులకు రాసుకోవాలి .మృతకణాలు పోయి చర్మం తాజాగా ఉంటుంది . పావుకప్పు పెరుగులో నిమ్మరసం , బాదం నూనె వేసి గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి , దానితో చేతి గోళ్లకు మసాజ్ చేస్తే గోళ్లు చేతుల్లో ఆరోగ్యంగా కన్పిస్తాయి .
Categories