Categories
చిన్న వయసు నుంచే ఆహారం విషయంలో కాస్త అప్రమత్తత తో ఉంటే గుండెకు పదిలంగా కాపాడుకోవచ్చు. చేపలు. ఓట్ మీల్ .స్ట్రా బెర్రీలు ,నిమ్మజాతి పండ్లు ,సొయా ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండే చేపలు వారానికి రెండు సార్లయినా తీసుకోవాలి. ఓట్ మీల్ ఉదయపు అల్పాహారంగా తీసుకుంటే గుండె పనితీరు మెరుగవుతుంది. స్ట్రా బెర్రీ రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. సి విటమిన్ పుష్కలంగా వుంటే సిట్రస్ పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్లు ఖనిజాలు అధికంగా వుండే సొయా హుద్రోగాలను దూరంగా ఉంచుతోంది.