వాతావరణ  కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్  యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు ముఖ చర్మం స్మూత్ గా  అయిపోయేందుకు ఉపయోగపడతాయి. లేదా బ్యూటీక్లినిక్స్ లో అయితే శాలిసిలిక్  యాసిడ్ క్రీములు అప్ప్లయ్  చేయటం కెమికల్ పీల్ చేస్తుంటాయి. వీటివల్ల చర్మం పైన పేరుకున్న జిడ్డు మృతకణాలు పోయి చర్మం నిగారింపుగా వస్తుంది. లేదా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్ లో తయారు చేసుకోవచ్చు. సున్నిపిండి సెనగపిండి సరిపాళ్ళ లో కలిపి నిమ్మరసం తేనె కలిపి మర్దన చేసినా  చర్మం రంగు చక్కగా అయిపోతుంది. టమాటా గుజ్జు తేనె నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకున్న చర్మ కాంతి మెరుగవుతుంది. సమస్యలన్నీ పోతాయి.

Leave a comment