చీరె అందం బ్లౌజ్ తో ముడిపడి ఉంటుంది. ఇప్పుడంత డిజైనర్ బ్లౌజ్ లదే హవా. హెవీ ఎంబ్రాయిడరీ పనితనం ఉన్న చీరెలకు ప్లెయిన్ డిజైనర్ బ్లౌజ్ లు ప్లెయిన్ చీరెలకు సెక్విన్ వర్క్ ఉన్న బ్లౌజ్ లు ఎంచుకోవాలి. జరీ పట్టు చీరలకు బ్రోకెడ్ సిల్క్ లేదా వెల్వెట్ వెరైటీ బ్లౌజ్ లు బావుంటాయి. బ్లౌజ్ కుట్టే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పటికప్పుడు కొలతలు మారిపోతూ ఉంటాయి కనుక ప్రతిసారి కొత్త కొలతలు ఇవ్వాలి. లోపలి నుంచి బయటకు జారిపోకుండా భుజాల దగ్గర హుక్ప్స్ బటన్స్ కుట్టమని టైలర్ కు చెప్పాలి. చీరె తో పాటు వచ్చే బ్లౌజ్ పీస్ బదులు విడిగా ఎంచుకోవాలి అనుకుంటే చీరె మెటీరియల్ తో బ్లౌజ్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఎంచుకునే లైనింగ్ నాణ్యమైనది గా ఉండాలి.

Leave a comment