పిల్లల్ని ప్రేమగా బాగా పెంచటంలో భాగంగా వాళ్లకు చదువులు స్కూళ్ళు తప్ప ఇంకో ప్రపంచం వుండకుండా చేస్తున్నారనీ వాళ్ళు సరిగా ఎదగటం అంటే వాళ్లకి ప్రాపంచిక జ్ఞానం అలవాటు చేయాలనీ సామజిక సత్సంబంధాలు అలవర్చుకునేలా చేయాలనీ ఎక్సపర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చింది చేసే అవకాశం మంచిచెడులు ఆలోచించే విజ్ఞత వారికి కలిగించాలి. పిల్లల్లకు తల్లితండ్రులు మానసికంగా అండగా ఉండాలనీ వాళ్లకు దగ్గర వుంది ప్రపంచాన్ని పరిచయం చేయాలనీ చెపుతున్నారు. ముఖ్యంగా పిల్లల జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని తల్లితండ్రులతో షేర్ చేసుకునే నమ్మకం ఇవ్వాలంటున్నారు. వాళ్ళను ఎదిగే క్రమంలో ప్రోత్సహించండి గానీ అభిప్రాయాలు వాళ్లపై రుద్దే ప్రయత్నం తప్పంటున్నారు. వాళ్ళను తప్పనిసరిగా ఒకటి రెండు భాషలు నేర్చుకునేలా ప్రోత్సాహించాలనీ క్రమశిక్షణ తో ఎదిగేలా చేయాలనీ ఎక్సపర్ట్స్ చెపుతున్నారు.
Categories