జ్యూయిలరీ డిజైనర్లు ఎంచెపుతారంటే ఆభరణాలు ధరించేవారి అందాన్ని ద్విగుణీకృతం చేయాలి. వ్యక్తిత్వంలో శరీరాకృతి కి సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే అవి నప్పుతాయి అని. ఉదాహరణకు సుస్మితాసేన్ కు ఏ రకం నగలైనా బావుంటాయి. కత్రినా కైతే కెంపులు పచ్చలతో చేసిన ఆభరణాలు పొడవాటి తేలికైన శాండియర్లు బావుంటాయి. ఇక స్క్వేర్ ఆకారంలో ముఖాకృతి ఉన్న కరీనా కపూర్ కయితే పొడవుగా కదులుతూ వుండే డాంగ్లర్స్ వేలాడే జుంకీలు పొడవాటి మెడను చుట్టే నగలు బావుంటాయి. హృదయాకారం గల మొహం ఉంటే ముత్యాల నగలు డాంగ్లర్స్ నుదుటి పైనుంచి దృష్టి మరలనివ్వకుండా ఉంటాయి. ఓవల్ షేప్ లో ముఖాకృతి ఉంటె పెద్ద శాండియార్స్ పొడవాటి చెవిపోగులు ఒల్కీ ఇయర్ రింగ్స్ చక్కగా ఉంటాయి. ఇక రౌండ్ షేప్ అయితే ఆభరన్లు అడ్డంగా గుండ్రంగా ఉండాలి. వేలాడే చెవుల ఆభరణాలు ఏ షేప్ లో ఉన్నా గుండ్రని ముఖానికి నప్పుతాయి. గుండ్రని మొహం సంప్రదాయంగా అందంగా ఉంటుందని డిజైనర్ల అభిప్రాయం.
Categories