ఈ ప్రపంచం మొత్తంగా దొరికే పండ్లు చాలానే ఉన్నాయి. వాటిని మనం మనకి అలవాటైన పద్దతిలో వాడతాం. రేగు పండ్లు గింజపైన కేవలం తొక్కగా మాత్రం వున్నా మనం సంతోషంగా తినేస్తాం. కోస్తా జిల్లాల్లో రేగి వడియాలు పెడతారు. చైనా కొరియా దేశాల్లో టీ రూపంలో ఈ పండు వాడతారు. బెంగాల్ బాంగ్లా  దేశాల్లో రోటి  పచ్చడి నిల్వ పచ్చళ్ళు పెడతారు. బూహిమియా  లో ఏడాది పొడవునా ఇవి డ్రై ఫ్రూట్స్ లా చప్పరిస్తారు. నిజానికి పచ్చిగా మనం తినేవాటికన్నా ఉడికించేస్తూ బేక్ చేసేస్తూ పోషకాలు ఎక్కువగా ఉంటాయంటారు. ఈ రేగు పండుకి సంతాన సాఫల్యతను పెంచే శక్తీ వుంది . వీటి తీయని వాసన యువతిని ప్రేమలో పడేస్తుందిట. మనమ్మకాల సంగతి ఆలా ఉంచి రేగు చెట్లు ఆకులు పండ్లు బెరడు అలోవెరా తో కలిపి సబ్బుల మాయిశ్చరైజర్లు క్రీములు తయారు చేస్తారు. ఇవి ముడతలను తగ్గించటంతో పాటు ఎండా నుంచి చర్మాన్ని రక్షించి ఎలర్జీల నుంచి కాపాడతాయి. ఇవి పండు గానే కాదు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటికి నిద్ర పుచ్ఛే శక్తి  చాలా ఎక్కువ. ఈ గింజలతో చేసే ఆయింట్మెంట్ కీళ్ల నొప్పులకు మంచి మందు.

 

Leave a comment