నేను లోకల్ సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రపంచానికే చాలా దగ్గరయ్యాననిపించింది. అంటోంది కీర్తి సురేష్. ఇది తన రెండవ సినిమా. ఎప్పుడైనా బయట కనిపిస్తే తెలుగువాళ్లు హాయ్ శైలజ అని పలకరిస్తారు నేను శైలజ లో నా పాత్రకి అంతగా కనెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంటుంది . మొదటి సినిమా తో రామ్ తో పాటు దర్శకుడు కిషోర్ నిర్మాత రవి కిషోర్ లకు తమిళం వచ్చు తమిళంలోనే సీన్లకు వివరించటంతో ఎంతో సౌకర్యంగా ఉండేది. నేను లోకల్ సక్సెస్ అవటం నాకు చాలా సంతోషంగా వుంది . ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసేదాన్ని అందుకు హీరో నాని నే ముఖ్య కారణం. వందల కొద్దీ ప్రశ్నలకు సందేహాలు అడిగిన ఓర్పుగా చెప్పేవారు. సీన్ ,మెరుగుపడేందుకు తన ఆలోచనలు షేర్ చేసేవాడు. మా అక్క రేవతి ‘ రేవతి కళామందిర్ ‘ అనే సినీ నిర్మాణ సంస్థను చూసుకుంటోంది. తాను తెలుగు సినిమాలు బాగా చూస్తుంది. నాని చాలా సహజంగా నటిస్తాడు నువ్వు చాలా ఎఫర్ట్ పెట్టాలి అతనితో సమానంగా నటించాలంటే అని హెచ్చరించింది. అందరి కోపరేషన్ తో సినిమా బాగా చేసాననిపించింది అంటోంది కీర్తి సురేష్.
Categories