జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ, హెర్బల్ టీ, వైట్ టీ ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ పొడితో పాటు కలిపి మరిగించి ఇందులో తేనె వేసి ఈ హెర్బల్ టీ తాగి చూడండి. ప్రాబ్లమ్ పరార్. వీలైతే తులసి ఆకులు మింట్ టీ కూడా ట్రై చేయచ్చు . ఇష్టమైతే చికెన్ సూప్ కూడా ట్రై చేయచ్చు. చికెన్ లో ఉండే సోడియం మంట ని తగ్గిస్తుంది. గొంతుకు స్వాంతన ఉంటుంది. సూప్ రూపంలో మితంగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఎక్కువగా ద్రవ పదార్ధాలు అదీ వేడిగానే తీసుకుంటే గొంతునొప్పి అంతగా విసిగించదు. గొంతు సంగతి అలా వుంచినా రోజుల్లో ఒకేసారి ఈ హెర్బల్ టీ తాగి ఎంతో ప్రయోజనం.
Categories