ఆర్గానిక్ కూరగాయలు పండ్లు సేంద్రియ ఎరువులు వేసి సహజమైన పద్ధతుల్లో పండిస్తారనీ  ఆరోగ్యానికి మంచిదనీ ఖరీదైనా  కొనాలనుకుంటాం. పళ్ళు ,కాయగూరల పై లేబుల్స్ ఉంటాయి. వాటిని బట్టి అవి ఆర్గానిక్ వా  కాదా తెలుసుకోవచ్చు. ఆపిల్ కూడా లేబుల్ పైన నాలుగు అంకెలు వుండి  మొదటి అంకె మూడు లేదా నాలుగు అని వుంటే  అవి పురుగు మందులు వేసినవి అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె ఎనిమిది అయితే అది జన్యు మార్పిడి ద్వారా పండించినది  అని అర్ధం. లేబుల్ పైన ఐదు అంకెలుండి మొదటి అంకె తొమ్మిదయితే అది ఆర్గానిక్  పండే. ఈ పళ్ళ పై వుండే లేబుల్ తినదగిన కాగితంతో జీర్ణమయ్యే జిగురుతో అంటిస్తారు. కానక పిల్లలు గబుక్కున లేబుల్ తో సహా తినేసినా ప్రాబ్లమ్ ఏవీ లేదు.

Leave a comment