ఆధునికమైన గృహలన్నీ పురాతన ట్రైబల్ ఆర్ట్స్ తో కళకళలాడుతున్నాయి. దండకారణ్యంలో నివశించే గోండులు, బైగాలు కొండ గుహాలపైన మట్టితో కలిపిన గోడలపైన తమ పరిసరాలలో ఉండే మొక్కలు, జంతువులను చిత్రికరించేవారు. ప్రకృతిలో సహాజంగా దొరికే రంగులు సేకరించి అద్దేవారు. అవి ఇప్పటి కాలంలో వచ్చే మార్పులకు తట్టుకొని వారి జీవన విధానం చరిత్ర ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆ చిత్రాల్లో కనిపించేది ఆకులు ,పక్షులే చుట్టు పరిసరిఆల్లో ఉన్నా ఏ అంశం మరిచిపోయేవాళ్ళు కాదు. జంతువులు ,పక్షులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇప్పుడా ఆర్ట్ ఫామ్ ఆధునికమైన ఇళ్‌ళలో గోడలను అలంకరించి ప్రాచీన వైభవాన్ని మేము వారసులమని చాటి చెప్పుకొంటున్నారు ఆధునికులు.

Leave a comment