రోజు ఒకటి రెండు కప్పులు టీ తాగితే మంచిదని వింటూ ఉన్నాం కానీ ఆ టీ తాగే పద్దతిలో జాగ్రత్తలు పాటించక పోతే ఎంతో నష్టం అంటున్నారు నిపుణులు పింగాణీ,గాజు కప్పుల్లో లేదా స్టీలు గ్లాసుల్లో టీ తాగితే పర్లేదు కానీ పేపర్ కప్పుల్లో మాత్రం అస్సలు తాగద్దు అంటున్నారు. పేపర్,ప్లాస్టిక్ కప్పుల్లో వేడి వేడి టీ పోయగానే వాటి తయారీలో ఉపయోగించిన పదార్ధాలు టీ లో కలుస్తాయని వీటి వల్ల దీర్ఘకాల రుగ్మతలు తప్పవని అంటున్నారు. హర్మోన్ల అసమతౌల్యం వంటి సమస్యలు వస్తాయని పేపర్ కప్పుల్లో టీ తాగటం మానేయ మంటున్నారు.

Leave a comment