Categories
ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్న పుదినాను విరివిగా వాడండి అంటున్నారు వైద్యులు. పుదినా ఆకుల్లో ఫినోలిప్ సమ్మెళనాలు ఉంటాయి. ఈ ఆకులు తినటం వల్ల లాలాజల గ్రంధులు చురుగ్గ పని చేసి జీర్ణ ప్రక్రియ కు కావల్లనా ఎంజైములు ఉత్పత్తి సజావుగా సాగుతుంది. ఆహారం చక్కగా జీర్ణం అవుతోంది. విటమిన్ ఎ,సి, ఫోలేట్ లతో పాటు మెగ్నీషియం,పొటాషియం,ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుదినా రోగనిరోధక శక్తిని పెంచుతోంది. టీ లో వేస్తే పరిమళ భరితం అవుతోంది. బిర్యానికి అదనపు రుచి వస్తుంది. పచ్చడి చేస్తే అరుగుదల వుంటుంది. దగ్గు,గొంతు నొప్పులు తగ్గించ గలుగుతుంది.