మారుతున్న జీవనశైలికి అనుగుణంగా చక్కని కెరియర్ కోసం ఈ తరం యువతులు 30 ఏళ్ల వచ్చిన తరువాతనే వివాహం చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 33 ఏళ్ల ఒక మహిళ బామ్మగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే బామ్మగా మారిన బ్రిటన్‌కు చెందిన ఈ మహిళ తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతోపాటు తన భవిష్యత్ ప్రణాళికలను కూడా వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన జెనీ మెడ్లమ్(33), అతని భర్త రిచర్డ్(34) ఇటీవలే తాత, నాయనమ్ములుగా మారారు. వారి 16 ఏళ్ల కుమార్తె ఈ ఏడాదే తల్లిగా మారింది. ఇంతచిన్న వయసులోనే తల్లిగా మారిన జెనీ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొందరు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. జెనీ కుమార్తె 16 ఏళ్ల వయసులోనే తల్లిగా మారడం ఆమె ఆరోగ్యానికి మంచిది కాదని వారంటున్నారు. జెనీ తన మనుమరాలి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనంతరం… జెనీ దంపతులు బ్రిటన్‌లో అత్యంత పిన్నవయసు తాత, నాయనమ్మలుగా గుర్తింపు పొందారు.

Leave a comment