క్షీర సాగర మధనంలో పాల కడలి లోంచి లక్ష్మీ దేవి జన్మించి నడిచి వస్తుంటే ఆమె కోసం ఇంద్రుడు రత్నాల పీఠం సృస్టించారట. దేవకంతులు బంగారు బిందెలతో నీళ్ళు తెచ్చారు. వసంతుడు తేనె సేకరించుకు వచ్చాడు. మేఘాలు మేళతళాలు మోగిస్తే సముద్రుడుసారె చీరలు ఇచ్చాడు. విశ్వకర్మ ఆభరణాలను సమర్పించాడు. ఎంత చక్కని ఆహ్వానం అమ్మకి. ఆమెను అష్టలక్ష్మి గా కొలుస్తారు. ఆర్ధిక విజయానికి పునాదిని వేసే ఆడి లక్ష్మిగా, శుభాల్ని ఇచ్చే ధన లక్ష్మి గా, ధైర్యాన్ని ఇచ్చే ధైర్య లక్ష్మి గా, విద్యను అనుగ్రహించే విద్యాలక్ష్మిగా విజయాలకు అధినేత విజయ లక్ష్మిగా సంతాన లక్ష్మి గా విజయలక్ష్మిగా సంతాన లక్ష్మిగా, గజ లక్ష్మి గా పుష్కలమైన పంటల నిచ్చే ప్రజలను కాపాడే ధాన్య లక్ష్మి ఆమె అష్టలక్ష్మి స్వరూపం ఆమె కోసం దీపాలు వెలిగించి స్వగతం పలికే రోజు దీపావళి.
Categories