Categories
హెడ్ ఫోన్లు ఇంట్లో పెట్టుకుంటే బాగానే వుంటుంది కానీ బయటకు వెళ్ళేటప్పుడు దీన్ని మోసుకుపోవడం బావుండదు పైగా అదేమంత ఫ్యాషన్ గా ఉంటుందని అమ్మాయిలు ఇలా కోప్పడతారనే ఇప్పుడు క్రౌన్ హెడ్ ఫోన్స్ వచ్చేసాయి. హెడ్ ఫోన్ కు రకరకాల రాళ్ళు, ముత్యాలు, రత్నాలు పొదిగి చూసేందుకు అచ్చం బుల్లి కిరీటాల్లా కనిపిస్తాయి. పువ్వులు పండ్లతో పూల కిరీటాల్లా కనిపిస్తున్నాయి. పువ్వులు పండ్లతో పూల కిరీటాల్లాగా వున్నాయి. అందమైన నాగల్లాగూ వున్నాయి. ఇక ఇవి చూసేందుకు అందం. వినేందుకు సౌకర్యం కుడా. వీటిని ఆన్ లైన్ లో ఆర్డరిచ్చి మనక్కావలసిన సైజ్ లో కుడా తెప్పించుకొవచ్చు.