Categories
కాకర కయ చేదుగా ,పెద్ద రుచేమిటి అనుకొంటారు కానీ ఇందులో అనేక ఔషధ గుణాలుంటాయి . ప్రతి రోజు కాకరకాయను ఆహారంలో భాగంగా చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి . ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళకి ఇది మంచి మందు లాంటిది . చక్కర స్థాయిల్ని తగ్గిస్తుంది . యాన్తి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుతుంది . వార్ధక్య లక్షణాల నుంచి చర్మ కణాలను పరిరక్షిస్తుంది . ఉదయం పూట కాకర రసం తాగటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి . ఎసిడిటి ఉంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కాకర రసం తాగితే నెమ్మదిగా తగ్గుతుంది .