2005లో లక్ష్మి అగర్వాల్ బస స్టాప్ లో నిలబడి ఉండగా ఒక వ్యక్తి యాసిడ్ దాడి చేసి పారిపోయాడు.లక్ష్మీ అతనితి పెళ్ళికి నిరాకరించిందని కోపంతో ఆమె పై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారు.అంతటి దారుణం తట్టుకుని లక్ష్మీ ధైర్యంగా నిలబడింది. తన పై జీవితం విసిరిన పెను సవాల్ ని ఎదుర్కొంది. యాసిడ్ బాధితులకోసం ఒక స్వచ్చంద సంస్థని స్థాపించింది.ఒక కెఫ్ నిర్వహిస్తుంది. ఈ కథ విన్నాక ఆమె బయోపిక్ నేను నిర్మించాలనుకున్నాను. ఆమె పాత్రలో కూడా నటిస్తా అంటుంది దీపికా పడుకునే. చిత్ర దర్శకురాలు మేఘనా గుల్జర్ ఈ పాత్ర పోషింఛటం మానసికంగా శారీరంకంగానూ సవాలే. కాని ఆ సవాల్ ను ఎదుర్కునే సత్తా దీపికాలో పుష్కలంగా ఉంది అంటుంది. యాసిడ్ బాధితులు జీవితం ఎంత కష్టభూయిస్టంగా ఉంటుందో ఆ అనుభవం తెర పై చూపించాలనుకున్నా. ఈ బయోపిక్ ను నేను చేయాలని చాలా గట్టిగా నిర్ణయించుకున్నా అంటుంది దీపికా.