ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసిన ఒక రిపోర్టు లో ఒక సంతోషకరమైన విషయం చోటు చేసుకుంది, మన దేశం తీవ్రంగా ఆందోళన చెందుతున్న స్త్రీ పురుష నిష్పత్తి మరో ముడేళ్ళకి తగ్గిపోతుంది. అంటే ఆడపిల్లల సంఖ్య మగవారికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇది వరకు ఐదేళ్ళ లోపు మగపిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుందని క్రమంగా ఆడపిల్లల సంఖ్య ఎక్కువవుతుందని చెప్పుతుంది సర్వే. ఇంకొక ముఖ్యమైన విషయం భారత్ లో తల్లులయ్యే వారి సగటు వయస్సు ఇరవై ఆరు మాత్రమేనని చెప్పుతుంది సర్వే. పాశ్చాత్యదేశాల్లో స్త్రీలు పెళ్ళాడటం, పిల్లల్ని కనడం రెండు అసాధ్యమే. ఒక్కల్లిద్దరు పిల్లలు పుట్టేసరికే వయస్సు నలభైకి దగ్గర వుంటుంది. కానీ మన భారత దేశంలో మాత్రం అమ్మాయిలు విద్య ఉద్యోగాల వైపు వెళుతున్న పిల్లలను కనే విషయంలో మాత్రం 26 కు మించడం లేదని ఈ ధోరణి ఇప్పట్లో మారదని చెప్పుతుంది సర్వే. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన వయస్సు ఇదే.
Categories