ఇరవై నిండే సరికే కాంపస్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి అమ్మాయిలకు హటార్తుగా అధిక స్వేచ్చ వచ్చే సరికి చేతి నిండా వుండే డబ్బులతో ప్లానింగ్ వాళ్ళకు కాస్త కష్టమే. కానీ సంపాదన మొదలు పెట్టిన రోజు నుంచి పక్క ప్లాన్ వుండాలి. తాత్కాలిక దీర్గకాళిక ఆర్ధిక లక్ష్యాలు పెట్టుకోవాలి. భవిష్యత్తులో మంచి జీవితం  కోసం ఇప్పుడు ఖర్చులపై అదుపు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి ముందుగా ఖర్చులు, మిగులు డబ్బుతో పొడుపు ఒక బుక్లో రాసి పెట్టుకోవాలి. స్నేహితులతో షాపింగ్ అనవసరం, సరదా కుడా , కానీ ఎంత ఖర్చు పెట్టి దాచుకున్నారు అంత డబ్బే అందుబాటులో వుంచుకోవాలి. షాపింగ్ మాల్స్ మాయాజాలం చేస్తాయి. ఎన్నో ఆఫర్లు కళ్ళు చెదిరే కొత్త దుస్తులు, అవసరమైన సామాన్లు ఉరిస్తాయి కానీ పొడుపు మంత్రం జపించండి. ఆర్ధిక పొరపాట్లు చేయొద్దు.

Leave a comment