చేతులు ,మెడపైన చర్మం సూర్యకిరణాల హానికి గురై నలుపెక్కటం ,బిరుసుగా అయి పోవటం జరుగుతోంది. గాలి కాలుష్యం కూడా చేతులు మెడ చర్మానికి హాని కలిగిస్తాయి.సూర్యకిరణాలకు ఎక్స్ పోజ్ కావటం వల్ల చేతులు తరుచూ కడుక్కొవటం వల్ల సహాజమైన నూనెలు త్వరగ పోతాయి. అలాగే ముఖం పట్ల చూపిన శ్రద్ధ ఈ చర్మంపై చూపించకపోవటం వల్ల బిరుసెక్కిపోతుంది.క్రమం తప్పని హైడ్రేటింగ్ చికిత్సాలు పీల్స్ అవసరం అవుతాయి. ముఖానికి రాసుకొనే హైడ్రేటింగ్ క్రీమ్స్ లోషన్స్ చేతులకు రాయాలి. మాయిశ్చరైజర్ పట్టిఉంచే ఫ్యాక్ లు వేసుకోవాలి. ప్రతి రోజు స్నానం తరువాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లైయ్ చేయాలి.

Leave a comment