ఈ తమిళనాడు టీచరుగారు గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం మూడు లక్షలు విలువ చేసే -నగలు అమ్మేసి తరగతి గదిని మోడ్రన్ గా అలంకరించేసారు. ఈ పాఠశాల తమిళనాడులో విల్లిపురం అనే ప్రాంతంలో వుంది. ఆ పాఠశాలలో ఆంగ్లం భోదిస్తారు అన్నపూర్ణ మోహన్. పిల్లలకు ఇంగ్లీష్ అంత సులభంగా రావడం లేదని అర్ధం అయ్యింది ఆమెకు. మూడో తరగతి వరకు వచ్చాక పిల్లలు నేర్చుకునేందుకు సిద్దంగా వుంటారు. వాళ్ళకి ఏదైనా చూపిస్తూ నేర్పిస్తూ వుంటే త్వరగా నేర్చుకోగలరు. ప్రభుత్వ పాఠశాలలకు ఏ వస్తువు కొనాలన్నా నిధులు లేవు. ఆమె తన విద్యార్ధుల కొసం తన నగలు అమ్మేసింది. మూడు లక్షల రూపాయిలతో స్మార్ట్ బోర్డు పెద్ద ఎల్ సి డీ తెర పిల్లలు కుర్చునేందుకు అధునాతన ఫర్నీచర్, గోడల నిండా విజ్ఞానం పంచె రంగు రంగుల బొమ్మలు ఇవన్నీ తన వైపు కనుకగా ఇచ్చింది. పుస్తకాలు, బ్యాగులు కూడా కనుకగా ఆ పిల్లలకు అందాయి. అన్నపూర్ణా మోహన్ తల్లి లాంటి టీచర్.
Categories