
‘పంగా ‘లో తల్లి పాత్ర నాకెంత తృప్తి నిచ్చిందో చెప్పలేను . అసలా కారెక్టర్ గురించి తలచుకొంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది . పల్లె వాతావరణం నుంచి పట్నానికి వచ్చాను . అందుకే పల్లెటూరు నా అభిమాన విషయం అంటుంది కంగనా రనౌత్ . నేను కాస్త చురుగ్గా మాట్లాడతానని అంటారు కానీ అది నా పల్లెటూరి మొహమాటం లేని అలవాటు సూటిగా ,మనసులో ఏమీ ఉంచుకోకుండా మాట్లాడటం నా పనిని నాకు నచ్చినట్లు చేసుకుపోవటం ,ఎలాటి కంగారు లేకుండా ఉండటం,ముఖ్యంగా మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని బయటికి చెప్పటం నా స్వభావం అంటోంది కంగనా. ఈ మధ్య చెన్నయ్ హైదరాబాద్ ల మధ్య తిరగటం ఎక్కువై పోయింది . దక్షిణాది అమ్మాయిలాగా అయిపోయాను ఇక్కడి కల్చర్ నాకు భలేగా నచ్చింది . పైగా మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి అంటోంది కంగనా .