Categories
ఏ మనిషి ఎదుగుదలకైనా కుటుంబానిదే ప్రధాన పాత్ర. ఏదో ఒక రోజు వ్యాపార నిర్వహణ మా అమ్మాయి లదే అని మా నాన్న అమ్మ నమ్మారు కనుకే నేను మా హోటల్స్ పగ్గాలు అందిపుచ్చుకున్న. ఇలా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలను నమ్మితే ఎంతోమంది నాయకులు తయారవుతారు అంటారు ప్రియా పాల్. పార్క్ హోటల్స్ చైర్ పర్సన్ కుటుంబ వ్యాపారమేగా ఎవరైనా చూసుకోగలరు అంటారు కానీ అందుకోసం చిన్నతనం నుంచి శిక్షణ కావాలి. నాయకత్వం లక్షణాలు పుట్టుకతో రావు వాటిని నేర్చుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలిగే నేర్పుని పెంచుకోవాలి నేను ఆ శిక్షణ ని మా ఇంట్లో నుంచి మా అమ్మానాన్నల దగ్గరే పొందాను అంటారు ప్రియా పాల్.