
కాన్పు తర్వాత ఆడవాళ్లకి కొన్ని నెలల పాటు జుట్టు ఊడిపోతూ ఉంటుంది. దీనికి కారణం గర్భధారణ సమయంలో శరీరంలో పెరిగిన ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ల స్థాయిలతో పాటు రక్తం పరిమాణం తగ్గిపోతుంది . గర్భిణిగా ఉన్న సమాయంలో హార్మోన్ల ప్రభావం వల్ల వెంట్రుకలు చాలా కాలం ఎదిగే దశలో కొనసాగుతాయి. పైగా రక్తప్రసరణ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకు పోషకాలు దండిగా లభిస్తాయి. కాన్పు తర్వాత హార్మోన్ల స్థాయి తగ్గి వెంట్రుకులు ఊడిన పెద్దగా గాబరా పడనక్కర లేదు. ఐదు నెలల తర్వాత జుట్టు సాధారణ స్థాయికి వస్తుంది. జుట్టు నెమ్మదిగా ,చిక్కులు పడకుండా దువ్వించి డ్రయర్లు, కర్లింగ్ ఐరన్ ల వంటివి కొద్ది కాలం వాడకుండా జుట్టుకు పోషణ ఇచ్చే పదార్థాలు ఆహారంగా తీసుకోంటే త్వరలోనే జుట్టు చక్కగా నెరుగుతుంది.