కన్నబిడ్డ పై అనురాగం చూపించే విషయంలో అమ్మస్థానంలో ఉన్న ఎవ్వరైనా ఒకటే. బాలీవుడ్ నటి రాణీముఖర్జీ తన ముద్దుల కూతురు అదిరా తొలిపుట్టినరోజున తన ప్రేమనంతా నింపిన ఒక ఉత్తరం రాసింది. అదిరా నువ్వంటే నాకెంతో ప్రేమ కాసేపు కనిపించక పోతే శ్వాస ఆగిపోతుందా అనిపిస్తుంది. ప్రతి నిమిషం నీ ధ్యాసే. అందరూ నాలాగే ఉంటారా? తమ పిలల్ల కోసం అనుక్షణం ఆందళోన చెందే అమ్మలందరికీ పాదాభివందనాలు చేయాలనిపిస్తుంది. నువ్వు పుట్టాక నాలో సహనం క్షమా గుణం పెరిగాయి. అంతరంగంలోకి చూసుకుంటే నేనెంతో మారిపోయాననిపిస్తోంది. ఇందుకు కారణం నువ్వే అదిరా. క్రమశిక్షణ తో ధైర్యంగా పెరగాలి. నిన్ను చూసి నారహో పాటు ఈ ప్రపంచం గర్వించాలి. నీ మనసుకి నచ్చిందే నువ్వు చేయి. అనుక్షణం ఆనందంగా జీవించు. ప్రేమతో మీ అమ్మ రాణీ ముఖర్జీ చోప్రా. ఇదీ ఉత్తరం. ఈ పాపాయిని కన్నతల్లైనా ఇంతకంటే తన బిడ్డను కోరేదీ ఆశీర్వదించేదీ ఉండదు.
Categories
Gagana

అదిరా ….. నువ్వు నన్ను మార్చేసావు

Leave a comment