వాసంతి విజయన్ వెటరన్ ఛాంపియన్. వయసు 74, రేస్ ట్రాక్ పైన పరుగులు తీయడం ఆమెకు ఎంతో ఇష్టం.కేరళలోని వయనాడ్ జిల్లా చేర్యాల ప్రాంతంలో పుట్టిన వాసంతి డిస్టిలరీలో కార్మికురాలు గా పనిచేశారు. అక్కడ జరిగే క్లబ్ డే పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుచుకున్న వాసంతి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్న పాల్గొంటూనే ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లోను పలు దేశాల్లో జరిగిన పోటీల్లోనూ ఛాంపియన్షిప్ సాధించారు. ఈ మధ్యనే అలెప్పీలో జరిగిన మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నారు వాసంతి.

Leave a comment