ఖరీదైన చక్కని చీరెలు,సూట్స్ ఉతికితే ఆ మెరుపులు పొతూ ఉంటాయి. ఇప్పుడు జెట్ స్టీమ్ టెక్నాలజీ తో పని చేసే ఎయిర్ డ్రెస్సర్ ఆ సమస్య తీర్చేస్తోంది. ఇందులోని ఎయిర్ హాంగర్ల కు దుస్తులను వేలాడ దీస్తే ఆవిరి పట్టించి అందులోని మురికిని జాగ్రత్తగా డస్ట్ ఫిల్టర్ ద్వారా తీసేస్తాయి డియోడరెంట్ ఫిల్టర్ ద్వారా దుస్తులు సువాసనలు వచ్చేలా చేస్తాయి. చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎయిర్ డ్రస్సర్ పని చేస్తుంది. దీని వల్ల దుస్తులు పాడవవు. దాన్ని యాప్ ద్వారా ఆపరేట్ చేయాలి. ఫ్యాబ్రిక్ ని బట్టి ఇది చక్కగా పని చేస్తుంది.