ములుగు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న తస్లీమా మహమ్మద్  కోవిడ్ కాలంలో ఆకలి అన్న వాళ్లకు సొంత తల్లి గా రూపం ఎత్తారు. బేషజాలు పక్కనపెట్టి కఠినమైన దారుల్లో కాలినడకన ప్రయాణం చేసి ఆహార పదార్ధాలు మందులు ప్రజలకు అందించారు వలస కూలీల కు స్వయంగా వండి పెట్టారు. చనిపోయినవారికి అంతిమ సంస్కారాలు చేయటానికి ఎవరూ ముందుకు రాకపోతే ఆమె దగ్గరుండి జరిపించారు.రెండేళ్ళ వయస్సు లో తండ్రిని కోల్పోయిన ఆమె తల్లి వ్యవసాయ పనులకు వెళ్లి చదివించింది.వ్యవసాయం పైన ఉన్న గౌరవంతో ఇప్పటికీ తస్లీమ్ వారంతంలో పొలంలో పని చేస్తుంది. తండ్రి స్ఫూర్తితో సర్వర్ అని ట్రస్ట్ స్థాపించి పేద విద్యార్థులను చదివిస్తోంది.

Leave a comment