Categories
ఆకలి పెంచుతాయని భోజనానికి ముందు టోమోటో జ్యూస్ తాగుతుంటారు. ఇదే జ్యూస్ ను ఖాళీ కడుపుతో తాగేరా ఇకంతే అంటున్నారు నిపుణులు.దీనిలోని టానిక్ ఆసిడ్ లు ఎసిడిటి పెంచి పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు. అలాగే మెగ్నిషియం ఎక్కువగా ఉండే అరటి పండు కూడా పరిగడుపున తినద్దంటున్నారు .అలాగే కొందరు నిద్రలేస్తూనే టిఫిన్ లాగా స్వీట్లు తినేస్తారు.ఇది చెడ్డ అలవాటు అంటున్నారు నిపుణులు. దీని వల్ల డయాబేటిస్ వచ్చే ప్రమాదం ఉందని చెపుతున్నారు. ఉదయాన్నే తీపి తింటే శరీరంలో ఇన్స్ లిన్ స్థాయిలు పెరిగిపోతాయి క్లోమ గ్రంధిపైన అదనపు భారం పడుతుంది.ఈ భారం మధుమేహానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.